Advertisement
Google Ads BL

మెగాస్టార్ మీరు గ్రేట్ సర్


మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ ఏజ్ లోనూ యంగ్ స్టర్స్ లా మూడు షిఫ్ట్ ల్లో పని చెయ్యడం అనేది యూత్ కి పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇప్పుడున్న హీరోలు ఏడాదికి రెండేళ్ళకి ఒక సినిమా చేస్తూ కూల్ గా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చెయ్యడమే కాదు.. మొన్నీమధ్యన ఒకే రోజు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొని కష్టపడుతూ యూత్ కి సవాల్ విసిరారు. వరస ప్రాజెక్ట్స్ కమిట్ అవడమే కాదు, ఆ ప్రాజెక్ట్స్ ని చకచకా పూర్తి చేసేస్తున్నారు. అయితే ఈరోజు అక్టోబర్ 1 న చిరు షెడ్యూల్ చూస్తే నిజంగా అమ్మో అనాల్సిందే. అమ్మో కాదండోయ్ మీరు గ్రేట్ సర్ అనాలి.

Advertisement
CJ Advs

చిరంజీవిగారు ఈరోజు చేసిన పనికి ఆయన ఫాన్స్ చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు. ఈ రోజు అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా కోకాపేట లోని అల్లు స్టూడియో చిరంజీవి చేతుల మీదుగా ఓపెన్ చేయించారు అల్లు ఫ్యామిలీ మెంబెర్స్. ఆ ఈవెంట్ లో స్పెండ్ చేసిన చిరు వెంటనే ముంబై ఫ్లైట్ ఎక్కి అక్కడ గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నారు. అబ్బ ఇదే గ్రేట్ అనుకుంటే.. మళ్ళీ ముంబై లో ఫ్లైట్ పట్టుకుని ఈవెనింగ్ అయ్యేసరికి హైదరాబాద్ లో వాలిపోయి అల్లు బుక్ లాంచ్ ఈవెంట్ లో హుషారుగా పాల్గొన్నారు చూడండి.. అది చూసిన మెగా ఫాన్స్ మాత్రమే కాదు, మిగతా మూవీ లవర్స్ కూడా చిరు సర్ మీరు గ్రేట్ అంటున్నారు. 

Megastar you are great sir:

Megastar Chiranjeevi busy schedule 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs