Advertisement
Google Ads BL

డైరెక్ట్ గా కొరటాలదే తప్పంటున్న చిరు


మెగాస్టార్ చిరు ఆయన కొడుకు రామ్ చరణ్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ చేసిన ఆచార్య డిసాస్టర్ అవడం నిజంగా కొరటాల బ్యాడ్ లాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆచార్య డిసాస్టర్ తరవాత మెగాస్టార్ తన తదుపరి సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడమే కాదు, ఆయన మరో సినిమాని రిలీజ్ కి రెడీ చేసినప్పటికీ.. కొరటాల ఇంకా కోలుకోలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కి లెక్కలు సెటిల్ చేసాడు. కానీ ఆచార్య సినిమా స్క్రిప్ట్ విషయంలో ఏం జరిగిందో కానీ.. ఇప్పుడు ఆ సినిమా డిసాస్టర్ కొరటాల మెడకి తగిలించేసారు మెగాస్టార్. నిన్నటివరకు ఇన్ డైరెక్ట్ గా కొరటాల గురించి మాట్లాడిన చిరు నేడు ఆచార్య డిసాస్టర్ కొరటాల వల్లే అని తెల్చేయ్యడం గమనార్హం. 

Advertisement
CJ Advs

గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా చిరుకి ఆచార్య డిసాస్టర్ వలన ఏమైనా బాధపడుతున్నారా అనే ప్రశ్న ఎదురవ్వగా.. ఆ సినిమా ఫ్లాప్ విష‌యంలో బాధ ప‌డ‌డం లేదు. నేను ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టే చేశా అంటూ అంతా కొరటాల వల్లే జరిగింది అని చెప్పడం నిజంగా కొరటాలకి షాక్ ఇచ్చినట్టే. హీరోగా అడుగుపెట్టాకా హిట్, ప్లాప్ లకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడిని. హిట్ అయితే హ్యాపీగా ఉండడం, ప్లాప్ అయితే బాధపడడం అనేది కామన్ గా మారింది. కానీ తర్వాత వాటికి ప్రాధాన్యం తగ్గిపోయింది. అందుకే ఆచార్య పోయినా పెద్దగా ఫీలవ్వలేదు. కాక‌పోతే.. నేనూ, చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టించిన సినిమా అది. ఫ్యూచర్ లో మ‌రోసారి మేమిద్ద‌రం క‌లిసి న‌టించాల‌నుకొంటే ఆచార్య అంత జోష్ ఉండ‌క‌పోవొచ్చు అంటూ చిరు డైరెక్ట్ గా ఆచార్య డిసాస్టర్ కి కొరటాలని బాధ్యుడిని చేసేసారు.

Chiranjeevi Direct Comments on Koratala Siva:

Chiranjeevi Is Still Serious On Koratala Siva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs