మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో ముచ్చటగా మూడో చిత్రంగా తెరకెక్కబోతున్న SSMB28 పై అంచనాలు మాములుగా లేవు. అలా వైకుంఠపురములో హిట్ ఉన్న దర్శకుడు అనే కాదు, ఆల్రెడీ మహేష్-త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజాలాంటి సినిమాలు రావడంతో మరోసారి మహేష్, త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలనే ఫాన్స్ కలని 12 ఏళ్ళ తర్వాత నెరవేర్చుస్తున్నాడు మహేష్. రీసెంట్ గానే SSMB28 షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తల్లి ఇందిరగారు మరణించడం, ఆమె దశ దిన కర్మలు పూర్తి చెయ్యాల్సి ఉండడం, అలాగే దసరా నవరాత్రులు అన్ని పూర్తయ్యాక ఈ నెల 10 నుండి సెకండ్ షెడ్యూల్ మొదలుకానున్నట్లుగా తెలుస్తుంది.
ఈ లోపు SSMB28 నిర్మాత నాగ వంశీ.. మహేష్-త్రివిక్రమ్ కాంబోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. త్రివిక్రమ్, మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూసిన ఆడియన్స్ కి ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని ప్రేక్షకులు థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా SSMB28 (వర్కింగ్ టైటిల్) ఉంటుంది.. అంటూ నాగ వంశీ చేసిన కామెంట్స్ తో మహేష్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు.