బాలకృష్ణ హోస్ట్ గా ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 షూటింగ్ రేపే మొదలు కాబోతుంది. షూటింగ్ మొదలైన నాలుగు రోజుల్లో అంటే అక్టోబర్ 4 న అన్ స్టాపబుల్ ట్రైలర్ వదలబోతున్నట్టుగా ఆహా నుండి అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే అన్ స్టాపబుల్ ఆంథెమ్ ఫాన్స్ కి బాగా ఎక్కేసింది. అయితే అన్ స్టాపబుల్ సీజన్ ఫస్ట్ గెస్ట్ మెగాస్టార్ చిరు అంటూ ప్రచారం జరిగింది. చిరు-బాలయ్యని ఓకె స్టేజ్ పై చూడడానికి అటు మెగా ఇటు నందమూరి ఫాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి చిరు ఫస్ట్ గెస్ట్స్ కాదట.. ఊహించని గెస్ట్ రాబోతున్నారట.
ఆయనే మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాలయ్య టాక్ షో సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ బావగారు, మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు సీజన్ 2 ఫస్ట్ గెస్ట్ అంటే మాములు విషయం కాదు. అల్లు అరవింద్ గారి స్కెచ్ మాములుగా లేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుంటే.. కేవలం చంద్రబాబే కాదు, నారా లోకేష్ కూడా ఈ షోలో మెరవబోతున్నట్లుగా తెలుస్తుంది. రేపే అన్ స్టాపబుల్ టాక్ షో షూటింగ్ మొదలు కాబోతుంది. చంద్రబాబు, లోకేష్ లు అక్టోబర్ 1 న అంటే రేపు బాలయ్య టాక్ షోకి అతిధులుగా రాబోతున్నారన్నమాట.