Advertisement
Google Ads BL

బాస్ పవన్ తో ఒక్క చాన్స్ వస్తే..


కొద్దిరోజులుగా సినిమాల విషయంలో సైలెంట్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా హరిహర వీరమల్లు వర్క్ షాప్ లో పాల్గొండడంతో హాట్ టాపిక్ గా మారారు. మే లో షూటింగ్స్ ఆపేసిన పవన్ కళ్యాణ్ మధ్యలో రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా ఓ వారం పాటు విదేశీ ట్రిప్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయమే జనసేన ఆఫీస్ దసరా పూజలో పాల్గొన్నారు. తర్వాత క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు వర్క్ షాప్ లో చాలా స్టైలిష్ లుక్ లో పాల్గొన్నారు. ఆ లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూసిన ఆయన ఫాన్స్ ఆగడం లేదు. సూపర్ స్టైలిష్ లుక్, ఏమున్నావన్నా ఈ ఫిజిక్ లో అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ మాత్రం తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ లుక్ పై స్పందించాడు. దేవర, దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయనతో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ కి పవన్ తో మరో సినిమా ఛాన్స్ వచ్చినప్పటికీ.. అది ఎప్పటికి తీరుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే పవన్ అన్ని సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు. అయితే ఈ రోజు హరి హర వీరమల్లు సెట్స్ లో పవన్ లుక్ ని పోస్ట్ చేస్తూ.. అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్..  బాస్ ⁦@PawanKalyan❤️ అంటూ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.

Bandla Ganesh tweet on Pawan Kalyan:

Bandla Ganesh Interesting Tweet On Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs