Advertisement
Google Ads BL

దీపికాతో విభేదాలపై రణ్‌వీర్ క్లారిటి


బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈమధ్యన స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ K షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినపుడే దీపికా పదుకొనే అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్ళింది. ఈమధ్యన మళ్ళీ అనారోగ్యం కారణంగా దీపికా పదుకొనే ముంబై ఆసుపత్రిలో చేరగా.. ఆమె ఆరోగ్యం మెరుగయినప్పటికీ.. కొద్దిరోజులపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అదలా ఉంటే కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో దీపికా పదుకొనే ఆమె భర్త రణవీర్ సింగ్ కి పొసగడం లేదు అని, వీరిమధ్యన విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రణవీర్ సింగ్.. దీపిక తో విభేదాలపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. దీపికా తాను 2012లో నుంచి డేటింగ్ ప్రారంభించామని.. తమ ప్రేమకు పదేళ్లు పూర్తయ్యాయని.. దీపికా అంటే తనకు చాలా గౌవరమని.. ఆమెని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటానని.. చెప్పిన రణ్వీర్ సింగ్ త్వరలోనే మీ అందరికీ ఒక మంచి సర్ ప్రైజ్ ఉందని.. తమను కలిసి చూస్తారంటూ సస్పెన్స్ క్రియేట్ చేసినప్పటికీ.. రణవీర్-దీపికా కలిసి ఓ మూవీ చేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. వ్యక్తిగతంగా దీపికా నుండి చాలా నేర్చుకున్నాను అని, ఆమె తన జీవితంలోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను అంటూ రణవీర్ సింగ్ తమ వైవాహిక జీవితంపై ఫుల్ క్లారిటీ చ్చాడు.

Differences With Deepika Padukone, Ranveer Singh Gave clarity:

Ranveer Singh Gave clarity Differences With Deepika Padukone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs