కరోనా కారణంగా ఓటిటీల హవా ఎంతగా పెరిగింది అంటే.. ప్రతి శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే చిత్రాలకి పోటీగా ఓటిటీల నుండి లెక్కకి మించిన చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. హిట్ అయిన సినిమాలు కాస్త వెనక ముందుగా ఓటిటి బాట పడితే.. ప్లాప్ సినిమాలు నెల తిరక్కుండా ఓటిటికి వచ్చేస్తున్నాయి. కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు ప్రతి శుక్రవారం ఎంతెలా వెయిట్ చేస్తారో.. ఓటిటి రిలీజ్ సినిమాల కోసము ఫ్యామిలీ ఆడియన్స్ అంతలా ఎదురు చూసేలా చేస్తున్నాయి ఓటిటి సంస్థలు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ 5, సోనీ LIV, హాట్ స్టార్, ఆహా అంటూ బడా ఓటిటి సంస్థలు ప్రేక్షకులని వారం వారం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి
ఈ శుక్రవారం సెప్టెంబర్ 30 న పొన్నియన్ సెల్వన్ థియేటర్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంటే.. బాలీవుడ్ నుండి విక్రమ్ వేద రిలీజ్ అవుతుంది. ఓటిటీల నుండి పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన 777charlie అమెజాన్ ప్రైమ్ లో అన్ని భాషల్లో విడుదలవుతుండగా.. అది ప్రస్తుతం రెంటెడ్ మూవీ గా ఆడియన్స్ కి అందుబాటులోకి రానుంది. తమిళ మూవీ కెప్టెన్ జీ 5 లో రిలీజ్ అవుతుంది. రేయికి వెయ్యికాళ్ల ఆహా నుండి విడుదలవుతుంది. మాడ్ కంపెనీ తమిళ ఆహాలో, తీర్పు మలయాళం నుండి హాట్ స్టార్ లో, కర్మ యుద్ద్ హిందీ హాట్ స్టార్ లో, ప్లాన్ A ప్లాన్ B హిందీ నెట్ ఫ్లిక్స్, బుజ్జి రా తెలుగు నుండి అమెజాన్ ప్రైమ్ లో, కోబ్రా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నుండి సోనీ LIV లో, రంగరంగ వైభవంగా నెట్ ఫ్లిక్స్, నట్చత్తిరమ్ నగర్జిరతు నెట్ ఫ్లిక్స్ నుండి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.