Advertisement
Google Ads BL

ఆదిపురుష్ నుండి అదిరిపోయే పోస్టర్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మొగల్తూరు వెళ్లారు. అక్కడ ఈ రోజు కృష్ణరాజు గారి సంస్మరణ సభ ముగించుకుని ఈరోజు నైట్ హైదరాబాద్ కి వస్తారు. ప్రభాస్ కొద్దిరోజులుగా సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ నుండి అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇప్పటివరకు ఆదిపురుష్ లో ప్రభాస్ కేరెక్టర్ పై రకరకాల ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూడడమే కానీ అసలు ప్రభాస్ పాత్రపై ఎలాంటి రూమర్స్ బయటికి రాలేదు, ఆ పాత్ర ఎలా ఉంటుందో అనే లీక్ కూడా లేదు. అందుకే ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ అప్ డేట్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 2 న ఆదిపురుష్ టీజర్ అంటూ ఓం రౌత్ సోషల్ మీడియాలో ప్రకటించినప్పటినుండి ప్రబస్ ఫాన్స్ ఆక్టివ్ అయ్యారు.

Advertisement
CJ Advs

అయితే రేపు శుక్రవారం ఆదిపురుష్ టీజర్ కి సంబందించిన పోస్టర్ రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి టీజర్ పోస్టర్ అంటే.. ఆల్మోస్ట్ ప్రభాస్ లుక్ రివీల్ అయినట్లే. అసలే ఆకలిమీదున్న ప్రభాస్ ఫాన్స్ కి ఎలాంటి లుక్ బయటికి వచ్చినా పండగే. మరి అక్టోబర్2 వరకు ఆగడం ఎందుకు రేపటినుండే ఆదిపురుష్ హడావిడి సోషల్ మీడియాలో కనిపించడం ఖాయం. ఇప్పటికే ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ అప్ డేట్స్ ని ట్రెండ్ చేసేందుకు రెడీగా కాచుకుని కూర్చున్నారు. 

AdiPurush teaser poster treat tomorrow:

Prabhas Adi Purush teaser poster treat tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs