Advertisement
Google Ads BL

మొగల్తూరు చేరుకున్న ప్రభాస్


నేడు సెప్టెంబర్ 29 కృష్ణం రాజు సొంతూరు మొగల్తూరు లో ఆయనని స్మరించుకుంటూ వేలాదిమంది అభిమానుల మధ్యలో సభ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి ఇప్పటికే మొగల్తూరు కి వెళ్లగా.. ప్రభాస్ కొద్దిసేపటి క్రితమే కృష్ణం రాజు కూతుళ్లతో మొగల్తూరు చేరుకున్నారు. ప్రభాస్ వస్తున్నాడని తెలిసి వేలాదిమంది అభిమానులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ రోడ్లపై హంగామా చేసిన దృశ్యాలు మీడియాలో హైలెట్ అయ్యాయి. భారీగా అభిమానుల ర్యాలీతో ప్రభాస్ మొగల్తూరు లో జరగనున్న కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరయ్యారు.

Advertisement
CJ Advs

అయితే ఈ సభకి మీడియాకి అనుమతి లేదు. ఈ సభలో కృష్ణం రాజుగారి ఫ్యామిలీ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనని అభిమానుల సమక్షంలో స్మరించుకోనున్నారు. ఈమధ్యనే కృష్ణం రాజు గారు కాలం చేసారు. హైదరాబాద్ సమీపంలోని ఆయనకి ఇష్టమైన కనకమామిడి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు, 11 వ రోజు కార్యక్రమం ఆయన స్వగృహంలోనే నిర్వహించారు. ఈ రోజు గురువారం ఆయన సొంతూరు మొగల్తూరు లో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తుండగా.. అక్కడికి కృష్ణం రాజుగారి అభిమానులతో పాటుగా ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని ప్రభాస్ కి ఘనస్వాగతం పలికారు. సభా ప్రాంగణానికి కిలోమీటర్ల మేర అభిమానులు కిక్కిరిసిపోయారు.

Prabhas reached Mogalthur:

Prabhas Reached Mogaltur With Krishnam Raju Daughters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs