Advertisement
Google Ads BL

మహేష్ బాబు ఇంట్లో దొంగ


నిన్న బుధవారం మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాదేవి గారు కొద్దిరోజులుగా AIG ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం ఎవరికి తెలియదు. మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా హడావిడివిగా అందుకే ముగించేసినట్లుగా తెలుస్తుంది. తల్లి ఆసుపత్రిలో ఉండడంతో మహేష్ తరచూ అక్కడికి వెళ్లివస్తుండేవారట. అయితే ఇందిరాదేవిగారి మరణించిన ముందురోజు మహేష్ బాబు ఆసుపత్రిలో ఉన్న టైం లోనే ఆయన ఇంట్లో దొంగ దూరిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. 

Advertisement
CJ Advs

ఓ వ్యక్తి మహేష్ సూపర్ స్టార్ అని తెలిసే వచ్చాడో లేదంటే దొంగతనం చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే..మహేష్ బాబు నివాసముంటున్న జూబ్లీ హిల్స్‌ రోడ్ నెం.81 లో ఉన్న ఇంటి కంపౌండ్ గోడ దూకి కిందపడడంతో ఆ శబ్దానికి అలెర్ట్ అయిన సెక్యూరిటీ గార్డ్స్ చూడగా.. అక్కడ ఓ వ్యక్తి గోడ దూకే క్రమంలో కిందపడడంతో గాయాలవగా అతన్ని చూసిన సెక్యూరిటీ వాళ్లు పోలీసుల‌కు ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఇవ్వడంతో.. అక్కడికి వచ్చిన పోలీసులు గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని హాస్పిట‌ల్లో జాయిన్ చేసి విచార‌ణ చేయ‌గా, అత‌ను మూడు రోజుల ముందు హైద‌రాబాద్ వ‌చ్చిన ఒరిస్సా కి చెందిన వ్యక్తిగా గుర్తించగా.. అతను ఇక్క‌డే ఉన్న న‌ర్స‌రీలో ప‌ని చేస్తున్న‌ట్లు తెలియడంతో.. గాయ‌ప‌డ్డ వ్య‌క్తి కోలుకున్న త‌ర్వాత పూర్తి స్థాయి విచార‌ణ చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. 

A thief caught while trying to rob Mahesh Babu House:

Mahesh Babu is residing at Jubilee Hills Road No.81
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs