Advertisement
Google Ads BL

అనుష్క పెళ్లిపై క్రేజీ న్యూస్


హీరోయిన్స్ కి ఆఫర్స్ తగ్గినా.. ఏదో ఒక విధంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు కానీ.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం తెగ ఆలోచించేస్తారు. పెళ్లి వయసు దాటిపోయినా.. పెళ్లి ముచ్చట మాత్రం ఎత్తరు. ఆ లిస్ట్ లో త్రిష, అనుష్క, తమన్నా, ఇలియానా లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే స్వీటీ అనుష్క-పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్యలో ఏదో ఉందని ప్రచారం జరగడమే కానీ.. వాళ్ళు మాత్రం మేము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతారు. అటు ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఇటు అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదు. సైజ్ జీరో బరువు వదిలించుకోడానికి నానా కష్టాలు పడుతున్న అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఓ మూవీ చేస్తుంది. అయితే ఆమె మాత్రం పబ్లిక్ గా ఫోకస్ అవ్వడం లేదు. 

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే మొన్న కృష్ణం రాజుగారు హాస్పిటల్ లో ఉన్న టైం లో అనుష్క ఆసుపత్రికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుందని.. అనుష్క తల్లితండ్రులు తెచ్చిన సంబంధం ఇది అని, తెలంగాణ ప్రాంతానికి చెందిన బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి జ‌రుగుతుంది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఆ న్యూస్ చూసిన ప్రభాస్ ఫాన్స్ కి షాక్ అంటూ మరో కథనం కూడా ప్రచారంలోకి వచ్చింది. 

Anushka Shetty Finally Getting Married:

Wedding Bells For Anushka?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs