ఈ ఏడాది దసరా శరన్నవరాత్రులు మొదలై మూడు రోజులైంది. వచ్చే దసరా విజయదశమి రోజున టాలీవుడ్ సినిమా అప్ డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడడానికి రెడీ అయ్యింది. స్టార్ హీరోలు, భారీ ప్రాజెక్ట్ లు, చిన్న సినిమాల కొత్త పోస్టర్, ఫస్ట్ లుక్స్, టీజర్స్, పెద్ద సినిమాలు, చిన్న సినిమాల రిలీజ్ లతో జాతరని తలపించనుంది. ఈ హంగామాలో నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ NBK107 నుండి టైటిల్ ట్రీట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే NBK107 నుండి బాలయ్య లుక్, టీజర్ రిలీజ్ చేసినప్పటికీ టైటిల్ విషయంలో మేకర్స్ ఇంకా ఇంకా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు.
కానీ అక్టోబర్ 5 దసరా రోజున మాత్రం ఈ సస్పెన్స్ కి తెరపడబోతుంది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న NBK107 పవర్ ఫుల్ కాదు ఊరమాస్ టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ మాసివ్ లుక్, పవర్ ఫుల్ టీజర్ ఫాన్స్ నే కాదు మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగా.. ఇప్పుడు టైటిల్ కూడా అంతే మాస్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య అండ్ NBK107 టీం ప్రస్తుతం టర్కీ లో ఉంది. హీరోయిన్ శృతి హాసన్, కీలక నటులు టర్కీ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.