Advertisement
Google Ads BL

వెంట వెంటనే సూపర్ స్టార్ ఇంట విషాదాలు


గత కొంతకాలంగా టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇంట వరస విషాదాలు నెలకొన్నాయి.. సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019 లో మరణించగా.. కృష్ణ గారు విజయ నిర్మల మరణంతో కుంగిపోయారు. ఈ ఏడాది జనవరిలోనే కృష్ణ గారి పెద్ద కొడుకు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ గారికి మొదటి భార్య, మహేష్ బాబు అమ్మగారైన శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి ఈ రోజు (సెప్టెంబర్ 28) ఉదయం మృతి చెందారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. 

Advertisement
CJ Advs

దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. మహేష్ బాబు కి అమ్మ ఇందిరా దేవి అన్నా, అన్న రమేష్ బాబు అన్నా ఎంతో ప్రేమ. తనని రమేష్ బాబు తండ్రి తర్వాత తండ్రిలా చూసుకున్నారని, ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేరని మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే తల్లి ఇందిరాదేవిని మహేష్ బాబు ఏ ఫంక్షన్ లో అయినా దగ్గరుండి చూసుకునేవారు. ఒకే ఏడాది మహేష్ కి అత్యంత ప్రియమైన వారు మరణించడం మహెష్ కి కోలుకోలేని విషాదం అనే చెప్పాలి.

Mahesh Babu Mother Indira Devi Passes Away:

Ghattamaneni Indira Devi, the wife of Superstar Krishna and mother of Superstar Mahesh Babu passed away today morning
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs