Advertisement
Google Ads BL

మంచు విష్ణు ఆవేదన


ఈమధ్యన సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై వచ్చినన్ని ట్రోల్స్ మరే ఇతర హీరోలపై రాలేదనే చెప్పాలి. మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యాక ఆయన పెట్టిన ప్రెస్ మీట్స్ కానివ్వండి, ఆయన చేసిన కామెంట్స్ పై ఇలా మంచు ఫ్యామిలీని ట్రోలర్స్ టార్గెట్ చేసారు. తర్వాత మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా మూవీ వచ్చినప్పుడు ఈ ట్రోల్స్ మరింతగా పెరిగిపోయాయి. మా మీద కావాలనే వేరే హీరోలు దుష్ప్రచారం చెయ్యడమే కాకుండా, ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ మంచు విష్ణు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఈ ట్రోల్స్ ఆగలేదు. మంచి విష్ణు ఏ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసినా ట్రోలర్స్ తమ పని తాము చేసేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మంచు విష్ణు టాలీవుడ్ లో ఓ హీరోపై అలిగేషన్స్ చేస్తున్నాడు. ఆ హీరో జూబ్లీహిల్స్ లోని తన ఐటి కంపెనీలో 21 మందిని స్పెషల్ గా నియమించి మమ్మల్ని, మా ఫ్యామిలీని ట్రోల్ చెయ్యడానికే వారితో ఉద్యోగం చేయిస్తున్నారు. ఆ కంపెనీ సర్వర్లు నుండి తమ పై ట్రోల్స్ చేపించి అప్ లోడ్ చేయిస్తున్నారు అని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చెయ్యడమే కాదు, ఆ హీరో పేరు, ఆ ఐటి కంపెనీ సర్వీస్ ప్రొవైడర్స్ పై, ఆ ఐటి అడ్రెస్స్ ని సైబర్ క్రైమ్ పోలీస్ లకి అందజేస్తాను అని చెప్పడమే కాదు.. 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా కనిపెట్టాము, ఆ ఛానల్స్ మా యాక్టర్స్ ని, వాళ్ళ ఫామిలీస్ ని కూడా హెరాస్ చేస్తున్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా చేసి వాటిని మూపించడానికి ఎంతకైనా తెగిస్తాను అంటూ మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టడం సంచలనం క్రియేట్ చేసింది. 

అయితే మంచు విష్ణు ని టార్గెట్ చేసిన ఆ హీరో ఎవరా అంటూ నెటిజెన్స్ ఇప్పుడు ఆలోచనలో పడిపోయారు. 

Manchu Vishnu makes startling allegations against top actor:

Manchu Vishnu attacking which top star?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs