Advertisement
Google Ads BL

మాస్ రాజా.. ముసలోడవుతున్నాడే!


ఒకవైపు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. మాస్ రాజా రవితేజ మాత్రం తన స్పీడ్ తగ్గించడం లేదు.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ తప్ప రవితేజకి సరైన హిట్టనేది లేదు. రీసెంట్‌గా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా వెంటనే రిటైర్‌మెంట్ తీసుకుంది. ఇక రాబోయే సినిమాలపైనే రవితేజ ఆశలన్నీ ఉన్నాయి. రవితేజ నుండి రాబోయే లిస్ట్ ఒక్కసారి పరిశీలిస్తే.. ‘ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన చిత్రాలు. ఈ చిత్రాలే కాకుండా.. రవితేజ మరొక చిత్రం కూడా సైన్ చేశాడని.. అందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నడనేలా వార్తలు వినబడుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో రవితేజ ఓ పాత్రలో 70 సంవత్సరాల ముసలోడిగా కనిపించనున్నాడట. 

Advertisement
CJ Advs

 

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ చిత్రానికి రవితేజ సైన్ చేశాడని, ఆ సినిమాలో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా రవితేజ కనిపించబోతున్నాడనేలా.. ఒక వైవిధ్యమైన పాత్రలో నటించబోతున్నాడనేది టాక్. అది ముసలోడి పాత్ర అని, ఆ పాత్రకి 70 సంవత్సరాల వయసు ఉంటుందని అంటున్నారు. ఇందులో రవితేజ చేసే యంగ్ పాత్ర కూడా పవర్ ఫుల్‌గా ఉంటుందని, ఆ పాత్ర సరసన అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Mass Raja Ravi Teja Turns Old Man For His next film:

Mass Raja Ravi Teja Different Role in Karthik Ghattamaneni Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs