Advertisement
Google Ads BL

సలార్ సెట్స్: ప్రశాంత్ నీల్ కి కోపం వచ్చింది


ప్రభాస్ తో సలార్ మొదలెట్టింది మొదలు ప్రశాంత్ నీల్ కి లీకులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రభాస్ ని మాస్ గా కాదు ఊరమాస్ గా చూపిస్తున్న విషయం ఆయన ఫస్ట్ లుక్ వదలకముందే సోషల్ మీడియాలోకి సలార్ సెట్స్ నుండి ప్రభాస్ లుక్ లీకైపోయింది. తర్వాత బైక్ లుక్ కూడా లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడే ప్రశాంత్ నీల్ సలార్ సెట్స్ లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు రాకుండా ఆంక్షలు విధించారు అని అన్నారు. రీసెంట్ గానే ప్రభాస్ సలార్ సెట్స్ లోకి వెళ్లారు. కృష్ణం రాజు గారి మరణం తర్వాత గత వారమే ప్రభాస్ సలార్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన లొకేషన్ లో సలార్ షూటింగ్ చేపట్టారు.

Advertisement
CJ Advs

అయితే అక్కడ సలార్ సెట్స్ నుండి కొన్ని సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో లీకైనట్లుగా తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొందరు మొబైల్ ఫోన్స్ తో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సెట్స్ లో ప్రత్యేకంగా సెక్యూరిటీ పెట్టినప్పటికీ.. ఈ లీకులు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. దాంతో ప్రశాంత్ నీల్ కి కోపం వచ్చి మరింత కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఎవరు కూడా సెట్స్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదు, అని షూటింగ్ సమయంలో బయటి వాళ్ళను ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదనే బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై చెయ్యబోయే షెడ్యూల్స్ కీలకమైనవి కావడంతో ప్రశాంత్ నీల్ ఈ విషయంలో కఠినంగా ఉండబోతున్నారట. ప్రభాస్ కూడా తన ఫోన్ వాడకూడదని, కారవ్యాన్ లోనే ఫోన్ వదిలేసి రావాలన్న రేంజ్ లో ఈ నిర్ణయం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Salaar sets: Prashanth Neel got angry:

Leaked picture of Prabhas from Salaar sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs