మనీ లాండరింగ్ కేసులో సతమతమవుతున్న జాక్వలిన్ ఫెర్నాండేజ్ కి కాస్త ఊరట లభించింది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ కోర్టుకి వెళ్లి అరెస్ట్ అవ్వకుండా మధ్యంతర బెయిల్ తెచ్చుకుంది. దానితో ఆమె అరెస్ట్ వాయిదా పడింది. సుఖేష్ చంద్ర శేఖర్ కేసులో జాక్వలిన్ నిందితురాలిగా పేర్కొంటూ ఈడి ఆమెకి సమన్లు పంపిన విషయం తెలిసిందే. సుఖేష్ నుండి జాక్వలిన్ చాలా రకాల గిఫ్ట్ లు అందుకోవడమే కాకుండా సుఖేష్ ఆస్తులకి బినామీగా ఉండడం, అలాగే సుఖేష్ జాక్వలిన్ కి గిఫ్ట్ ల రూపేణా ఇళ్ళు కొనుగోలు చెయ్యడం వంటి విషయాల్లో ఈడి జాక్వలిన్ ని టార్గెట్ చేసింది.
ఈడి పంపిన సమన్ల ప్రకారం ఆమె ఈ నెల 26 న ఢిల్లీ కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా.. ఆమె తన లాయర్ తో పాటుగా కోర్టుకి హాజరై బెయిల్ కి అప్లై చేసింది. అప్పటికే జాక్వలిన్ రెగ్యులర్ బెయిల్ విచారణలో ఉండడంతో, ఇప్పుడు మధ్యంతర బెయిల్ కోసం మరోసారి అప్లై చెయ్యడంతో కోర్టు ఆమెకి 50 వేల రూపాయల పూచి కత్తుతో, అలాగే షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దానితో జాక్వలిన్ కాస్త ఊపిరిపీల్చుకుంది.