బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం ఎలిమినేషన్ స్కిప్ చేసిన నాగ్ రెండో వారం డబుల్ ఎలిమినేషన్స్ తో షాని, అభినయాలకి బిగ్ షాక్ ఇచ్చారు. మూడో వారం నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. నాలుగో వారం నామినేషన్స్ లో హీట్ హౌస్ ని కుదిపేసింది. సుదీప vs ఇనాయ, ఇనాయ vs శ్రీహన్ అన్నట్టుగా ఈ ఎలిమినేషన్స్ ప్రక్రియ జరిగినట్లుగా తాజా ప్రోమోలో చూపించారు. ఈరోజు ఎలిమినేషన్స్ లో భాగంగా టమాటాలు పగలగొట్టి ఇద్దరి కంటెస్టెంట్స్ ని నామినేట్ చెయ్యాల్సి ఉంటుంది. శ్రీహన్ నేరుగా ఇనాయ తలపై టమాటా పిసికి వాడు వీడు అంటే తీసుకోలేకపోయారు. నన్ను పిట్టా అంటే ఎలా తీసుకుంటారు.. నా కాలు మీద ఎలక వెళ్ళిందిరా అన్నా నన్నే ఎలక అన్నారు అంటారు అంటూ ఇనాయని నామినేట్ చేసాడు.
దానికి పిట్టా అని నన్ను ఎలా అంటారు అంటూ ఇనాయ మళ్లీ గొడవ పడింది. ఇక సుదీప రేవంత్ ని ఇండివిడ్యువల్ గేమ్ ఆడిన కారణంగా నామినేట్ చెయ్యగా.. ఇనాయని సుదీప్ నామినేట్ చేసింది. పదిమంది రాంగ్ అని చెప్పినా నువ్ రైట్ అంటావ్ అని సుదీప అనగా.. నాకు నచ్చినట్టుగా ఉండడానికి హౌస్ కి వచ్చాను, 20 మందికి నచ్చినట్టుగా ఉండడానికి రాలేదు అంది ఇనాయ. అబద్దాన్ని నిజమని చెపితే అది నిజమవదు అంది సుదీప. దానితో ఇనాయ గొడవకి దిగింది. అక్కడ మాట మాట పెరిగి సుదీప్ గట్టిగా ఇనాయ ఆగు అంటూ అరిచింది. ఇక టాస్క్ సరిగ్గా ఆడని కారణంగా చంటిని, గొడవలుపడుతున్న ఇనాయని గలాటా గీతు నామినేట్ చేసింది. ఆరోహకి ఇనాయకి కూడా నామినేషన్స్ విషయంలో గొడవయ్యింది. ఈ రోజు నామినేషన్స్ హీట్ హౌస్ లో మాములుగా లేదు అనిపించింది.