Advertisement
Google Ads BL

ప్రభాస్ ఏడ్చేశాడు.. అయ్యో ఏం ఎడిట్ చేశార్రా?


ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే.. ఆ ఫ్యామిలీలోని పర్సన్స్ ఎంతగా కృంగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు అనుభవించాల్సిన బాధే. ఈ బాధలో ఉన్నవాళ్లని ఓదార్చడం తప్ప.. చేసేది కూడా ఏమీ లేదు. ఇప్పుడలాంటి బాధనే ప్రభాస్ ఫ్యామిలీ అనుభవిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కొన్ని రోజుల క్రితం.. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ప్రభాస్ ఫ్యామిలీనే కాదు.. యావత్ తెలుగు సినీ పరిశ్రమే పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయనకి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాసే ఇప్పుడా ఫ్యామిలీకి అన్నీ. పెదనాన్న మరణంతో ప్రభాస్ కొన్ని రోజులుగా మౌన వేదనను అనుభవిస్తున్నాడు. ఎలా ఓపెన్ కావాలో కూడా ఆయనకి అర్థం కావడం లేదు. పెదనాన్న భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుండి ఇంటికి, అక్కడి నుండి అంతిమ సంస్కారాలకు తీసుకుపోయే వరకు ప్రభాస్‌ని గమనిస్తే ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన ఎమోషన్ అంతా.. ఇప్పుడు ఓ ఫ్యాన్ చేసిన వీడియోతో ప్రభాస్ షేర్ చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

 

తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కృష్ణంరాజు, ప్రభాస్‌ల అభినయాన్ని.. వారు నటించిన కొన్ని సినిమాలలో సన్నివేశాలను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేస్తూ ఎడిట్ చేశారు. నిజంగా ఈ వీడియో చూస్తే.. కృష్ణంరాజుకి అసలు సిసలైన వారసుడే కాదు.. ఆయనని సేమ్ టు సేమ్ ప్రభాస్ దించేస్తున్నాడని అనుకోకుండా ఉండలేరు. ఈ వీడియో ప్రభాస్‌కి కూడా ఎంతగానో నచ్చేసింది. అందుకే ఎంతో దు:ఖంలో ఉన్న ప్రభాస్.. తన ఎమోషన్‌ని ఈ రూపంలో షేర్ చేశాడంటూ ఆయన అభిమానులు సైతం మాట్లాడుకుంటున్నారు. అంతే కాదు, ఈ వీడియోని ఎడిట్ చేసిన వారిపై కూడా ప్రశంసలు కురిపిస్తూ.. ‘ఏం ఎడిట్ చేశార్రా?’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

Click Here for Video:

Prabhas Shared His Fans Edited Video :

Prabhas Shared Video in Instagram goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs