Advertisement
Google Ads BL

బండ్లన్నోయ్.. ఏంటిది? బ్లాక్‌బస్టర్ అంతే!


బండ్ల గణేష్.. కావాలని చేస్తాడో? లేక కామెడీ కోసం చేస్తాడో తెలియదు కానీ.. ఒక్కోసారి ఆయన చేసే పనులు.. చూసే వారికి వింతగా అనిపిస్తుంటాయి. ఆయన చేసే ట్వీట్స్ కూడా.. తెలిసి చేస్తాడో.. తనకి తెలిసింది చేస్తాడో.. తెలియదు కానీ.. తన అమాయకత్వపు ట్వీట్స్‌తో ఒక్కోసారి నవ్వులపాలైతే.. ఒక్కోసారి ఆయన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటాడు. ఏదిఏమైనా.. ఆయనకి ఎలాంటి రియాక్షన్ వచ్చినా.. అది బ్లాక్‌బస్టరే అని ఆనందపడిపోతుంటాడు. అందుకే ఆయనని బ్లాక్‌బస్టర్ గణేష్ అంటుంటారు. ఇక విషయంలోకి వస్తే.. ఆ మధ్య ‘మా’ ఎన్నికలు జరిగినప్పుడు జీవితను ఓడించాలని.. కంకణం కట్టుకుని మరీ దిగిన బండ్లన్న.. తన శపథం నెరవేర్చుకున్నాడు. ఆమెను ఓడించడానికి ఎంత ఖర్చు పెట్టి ఉండాడో అని కూడా అప్పట్లో ఆయనపై వార్తలు వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (FNCC)‌కు జరుగుతున్న ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీకి దిగుతున్నాడు. 

Advertisement
CJ Advs

 

ఆయన పోటీ చేస్తున్నందుకు కాదు కానీ.. ఆయన చేస్తున్న హడావుడే.. ఇప్పుడు బండ్లన్నని మరోసారి వార్తలలో నిలుపుతోంది. పోటీకి దిగకముందే.. ఆ పదవికి పోటీ చేయడానికి సుమారు 5 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు బండ్ల. అదెలా అంటే.. ఇదే వైస్ ప్రెసిడెంట్ పదవికి మరో సీనియర్ నటుడు శివాజీ రాజా కూడా పోటీ చేయాలని అనుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఓ ఒప్పందం చేసుకున్నారు. పోటీ నుండి తప్పుకునే వారు.. ఆ తప్పుకున్న వారి కోరికను నెరవేర్చాలని. అందులో భాగంగా శివాజీ రాజా తప్పుకుని.. తన కోరిక ప్రకారం నరేష్ అనే డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు బండ్లతో 5 లక్షల రూపాయలను ఇప్పించాడు. ఇక తనకు లైన్ క్లియర్ అవడంతో.. ఫిల్మ్ నగర్ అంతా కటౌట్స్‌తో కదనరంగానికి సిద్ధం అనేలా బండ్ల తన భారీతనాన్ని ప్రదర్శించాడు. అయితే.. అక్కడ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే వారి ఫొటోలు కూడా ఈ కటౌట్స్‌లో కనిపించీ కనిపించనట్లుగా ఉంటే.. బండ్ల గణేష్ ఫొటోలు మాత్రం అర కిలో మీటర్ దూరంలో ఉన్నోడికి కూడా కనిపించేంత పెద్దగా ఉండటం విశేషం. అదీ బండ్ల గణేష్ అంటే.. బ్లాక్‌బస్టర్ అంతే!

Bandla Ganesh cutouts Creates Sensation at Film Nagar:

Bandla Ganesh Contesting as a Vice President in FNCC Elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs