Advertisement
Google Ads BL

‘గాడ్‌‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్ వేడుక డిటైల్స్ ఇవే!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవే స్వయంగా రంగంలోకి దిగి పబ్లిసిటీని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతున్నారు. ఇప్పటికే మేఘాల్లో యాంకర్ శ్రీముఖికి చిరు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోలు వైరల్ అవుతుండగా.. ఇప్పుడీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

 

‘గాడ్‌‌ఫాదర్‌’ మెగా ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబరు 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. ఈ మెగా వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ‘గాడ్‌ఫాదర్’ టీమ్‌ అంతా హాజరవుతుందని.. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుకకు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్రబృందం పేర్కొంది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాతో.. సల్మాన్ ఖాన్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Chiranjeevi GodFather Pre Release Event Details:

GodFather Mega Public Event In Anantapur On September 28th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs