Advertisement
Google Ads BL

పవన్ తో సినిమా అలా మిస్సయ్యింది


మోహన్ బాబు తో డైమండ్ రత్నబాబు చేసిన సన్ అఫ్ ఇండియా ఘోరమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. కనీసం ఆ సినిమాకి రివ్యూస్ కూడా పడలేదు. అస్సలు ఆ సినిమా విడుదలైన విషయమే ఆడియన్స్ కి తెలియకుండా పోయింది. తాజాగా ఆ సినిమా డిసాస్టర్ అవడం వలన తనకి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం పోయినట్లుగా చెప్పుకొచ్చారు డైమండ్ రత్నబాబు. సన్ అఫ్ ఇండియాలో బండ్ల గణేష్ ఓ కేరెక్టర్ చేసారు. ఆ టైం లో బండ్ల గణేష్ కి సన్ అఫ్ ఇండియా కథ బాగా నచ్చింది. అదిరిపోయింది తమ్ముడు అని మెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే పవన్ తో సినిమా ఇప్పిస్తా కథ రెడీ చేసుకో అన్నాడు. దానితో నేను మెకానిక్ అనే కథ రెడీ చేసుకుని దానికి క్యాప్షన్ గా రాష్ట్రం రిపేర్‌కు వచ్చింది అని పెట్టాను.

Advertisement
CJ Advs

కథ విన్న బండ్ల గణేష్ అదిరిపోయింది. పవన్ తో సినిమా కన్ ఫర్మ్ అన్నారు. కానీ సన్ అఫ్ ఇండియా సినిమా డిసాస్టర్ అయ్యింది. దానితో నా ఫోన్ ఎవరూ ఎత్తలేదు. సినిమా హిట్ అయితే పార్టీలకి పిలుస్తారు. కాని ప్లాప్ అయితే కనీసం ఇరానీ చాయ్ తాగడానికి కూడా ఎవరూ పిలవరు. సక్సెస్ ఉంటేనే విలువిస్తారు. సినిమా పొతే భుజం మీద చెయ్యి కూడావేసి మాట్లాడరు. ఆ సినిమా తర్వాత నా పనైపోయింది అనుకున్నారు. కానీ నేను నిరాశలో ఉన్న టైం లో నా ఫోన్ మోగింది. అది మోహన్ బాబు గారి కాల్. దానితో చాలా బాధగా ఉంది సర్ అన్నా.. ఎందుకు బాధ మనం ప్రయోగం చేసాం. అది ఆడియన్స్ కి నచ్ఛలేదు. అది నీ తప్పా. నీవు చాలా బాగా చేశావు. వండర్‌ఫుల్ మేకింగ్. నీకు మంచి భవిష్యత్ ఉంది. అంటూ భుజం తట్టారు. మంచి కథ చెబితే మరో సినిమా చేస్తా అన్నారు. ఆయన మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన ఇచ్చిన మాటను ఎంకరేజింగ్‌గా తీసుకుని మళ్లీ సినిమాల వేట మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా చేసిన అన్ స్టాపబుల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Diamond Ratnababu about movie with Pawan Kalyan:

Diamond Ratnababu missed movie with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs