Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ పేరు మార్పు: బాలయ్య ఫైర్


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం అనేది టిడిపి నేతలకు, ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ అస్సలు నచ్చడం లేదు. ఈ విషయమై నందమూరి రామకృష్ణ, కళ్యాణ్ రామ్, తారక్ ఇలా ఎవరి స్టయిల్లో వారు స్పందిస్తే.. బాలకృష్ణ మాత్రం నాలుగు రోజులుగా మౌనంగానే కనిపించారు. ఆయన ప్రస్తుతం NBK107 షూటింగ్ కోసం టర్కీలో ఉన్నారు. తండ్రి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లేట్ గానే స్పందించినా ట్వీట్ రూపంలో లేటెస్ట్ గా స్పందించడం టిడిపి నేతల్లో ఉత్సాహాన్ని నింపింది.. బాలకృష్ణ ట్వీట్ చేస్తూ..

Advertisement
CJ Advs

మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..

ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. 

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..

కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..

శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..

- నందమూరి బాలకృష్ణ అంటూ ఘాటుగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తెలుగు తమ్ముళ్లు బాలయ్య ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్వీట్ తో సరిపెట్టిన బాలకృష్ణ త్వరలోనే షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చాక ప్రెస్ మీట్ పెడతారని తెలుస్తుంది.

Balakrishna Reaction On NTR Health University Name Change:

Nandamuri Balakrishna tweet on NTR Health University
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs