నిన్న(సెప్టెంబర్ 23) తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లెక్కకు మించిన సినిమాలు థియేటర్స్ పై దండెత్తాయి. వీటిలో నాగ శౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి.. ఛలో సినిమా తర్వాత అతనికి కాస్త ఊరటనిచ్చే ఫలితంగా కనిపిస్తుంది. శ్రీ విష్ణు చేసిన అల్లూరి ఆర్ధిక ఇబ్బందుల వలన సకాలంలో విడుదల కాకపోవడం సినిమాపై ఓపెనింగ్స్ పై తీవ్రంగా ప్రభావం చూపించింది. శ్రీ సింహ చేసిన దొంగలున్నారు జాగ్రత్త ఇమ్మెచ్యూర్డ్ అటెంట్ గా మిగిలిపోయింది. అలాగే మిల్కి బ్యూటీ తమన్నాతో బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ చేసిన బబ్లీ బౌన్సర్ పట్ల కూడా విమర్శకులు పెదవి విరిచేసారు. మొత్తం మీద చూసుకుంటే ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో కృష్ణ వ్రింద విహారి బెటర్ ప్రాజెక్ట్ అనిపించుకుంది.
ఇక వచ్చే వారం మణిరత్నం పొన్నియన్ సెల్వం, ధనుష్ నేనే వస్తున్నా సినిమాల రూపంలో రెండు డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. అలాగే బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్-సైఫ్ అలీ ఖాన్ చేసిన మచ్ అవైటెడ్ ఫిలిం విక్రమ్ వేద రిలీజ్ కాబోతుంది. అలాగే వాటితో పాటు చిరంజీవి, గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరగబోతున్నాయి. మొత్తానికైతే మళ్ళీ థియేటర్స్ దగ్గర సరైన సందడి కనిపించాలంటే దసరా రిలీజ్ ల వరకు వెయిట్ చెయ్యాల్సిందే.