Advertisement
Google Ads BL

స్వీటీ ఫ్యాన్స్‌కి.. స్వీట్ న్యూస్


స్వీటీ అనుష్క పబ్లిక్‌లో ప్రత్యక్షమై చాలా కాలమే అయింది. ఇప్పుడామె ఏ సినిమా చేస్తుందో తెలియనంతగా అనుష్క పరిస్థితి మారిపోయింది. అంతకుముందు, హీరోల సరసనే కాకుండా.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అలరించిన అనుష్క.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఈ గ్యాప్ అవకాశాలు లేక వచ్చిందో.. లేక ఆమెనే కావాలని తీసుకుందో తెలియదు కానీ.. అసలెందుకు ఆమె సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులలో ఒకటే అనుమానాలు. అలాంటి అనుమానాలతో ఉన్నవారందరికీ స్వీటీ తరపు నుండి ఇప్పుడో స్వీట్ న్యూస్ వినిపిస్తోంది. 

Advertisement
CJ Advs

 

నటసింహం నందమూరి బాలయ్య హోస్ట్‌గా ‘ఆహా’లో త్వరలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ 2 టాక్ ‌షో‌కి అనుష్క రాబోతుందట. నిజంగా ఇది స్వీటీ ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూసే. ఎందుకంటే, ఆమె గురించి తెలియని విషయాలు.. ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు బోలెడన్ని ఉన్నాయి. ముఖ్యంగా మూడు సంవత్సరాలుగా ఆమె సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటుందో.. ఈ షో లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే అనుష్క ఈ షోకి వస్తుందని తెలియగానే.. ఒక్కసారిగా ఈ షో, అలాగే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలయ్య నటించిన ‘ఒక్కమగాడు’ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ పరిచయమే.. ఇప్పుడామెని ఈ షోకి ఒప్పించిందని.. త్వరలోనే అనుష్క‌తో ఎపిసోడ్ చిత్రీకరించనున్నారనేలా ‘ఆహా’ వర్గాల్లో వినిపిస్తోంది. 

Sweet News to Sweety Anushka Fans:

Anushka to Make Public Appearance with Balayya Unstoppable 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs