Advertisement
Google Ads BL

సుధీర్ ఎక్కడా కనబడకుండా పోయాడే..


ఈటీవీలో ఢీ డాన్స్ షో, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ మూడు షోస్ లో మూడు రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరగా ఉండే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకోవడమే కాదు, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీని వదిలి బయటకి వెళ్ళిపోయాడు. అలా ఈటీవీలో మానేశాడో లేదో ఇలా స్టార్ మా లో సింగింగ్ ప్రోగ్రాం కి యాంకర్ గా వచ్చాడు. తర్వాత ఓ స్పెషల్ ప్రోగ్రాం కోసం జీ ఛానల్ కి వెళ్ళాడు. ఇక ఆయన నటించిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే కనిపించాయి.

Advertisement
CJ Advs

ఈటివి నుండి జంప్ అయిన సుధీర్ మొన్నామధ్యన ఓ షో కోసం మళ్ళీ ఈటీవికి వచ్చాడు. కానీ ఓ వారం నుండి సుధీర్ ఏ ఛానల్ లోను కనిపించడం లేదు. స్టార్ మా సింగింగ్ ప్రోగ్రాం అయ్యిపోవడం, ఈటీవిలోకి వెళ్లలేకపోవడంతో సుధీర్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నాడు. వాంటెడ్ పండుగాడు, గాలోడు రెండు సినిమాలు షాక్ ఇవ్వడం, ఇటు యాంకరింగ్ చెయ్యడానికి షోస్ కూడా లేకపోవడంతో సుధీర్ పెద్దగా కనిపించడం లేదు. దానితో అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. మరి సుధీర్ మళ్లీ ఏ కొత్త షోస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Sudheer missing in programs:

Sudigali Sudheer Upcoming shows
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs