Advertisement
Google Ads BL

బిగ్ బాస్ పై జబర్దస్త్ పంచ్


ఈటీవీలో దసరా స్పెషల్ గా నవరాత్రి ధమాకా అనే ప్రోగ్రాం ని ప్లాన్ చేసారు. ఐదేళ్ల తర్వాత రచ్చ రవి మళ్లీ ఈటివి ప్రోగ్రాం లో కనిపించడమే కాదు, బిగ్ బాస్ ఫేమ్ సిరి పదహారణాల తెలుగమ్మాయిలా లంగాఓణిలో ఈ షోకి యాంకరింగ్ చేసింది. రచ్చ రవి - సీరియల్ నటి కరుణ స్కిట్ చేస్తుంటే.. వాళ్లపై హైపర్ ఆది వేసిన పంచ్ లకు బుల్లితెర ప్రేక్షకులు పడి పడి నవ్వాల్సిందే. శివుడి పూజలో మునిగి తెలుదాం, మొత్తం జాగారం చేద్దామని రచ్చ రవి అనగానే.. ఆది వచ్చి అరే వీడికి నవరాత్రికి-శివరాత్రికి తేడా తెలియడం లేదు, ఎవర్రా వీడిని పిలిచింది అంటూ పంచ్ వేసాడు. తర్వాత బిగ్ బాస్ సిరి వచ్చి నాన్నా నాకు ఇంట్లో ఉండాలంటే రెండ్రోజులకే బోర్ కొడుతుంది అని ఆదితో అనగానే.. ఆది నీకు రెండ్రోజులకే బోర్ కొడితే.. 100 రోజులు ఉన్నవాళ్ళకి ఎంత బోర్ కొట్టాలి చెప్పు అన్నాడు.

Advertisement
CJ Advs

అదేమిటి నేను చాలా ఫన్ ఇచ్చానే అంది సిరి. దానికి హైపర్ ఆది ఫన్ అంతా షన్నుకే ఇచ్చావ్ మాకేమిచ్చావ్ అంటూ బిగ్ బాస్ లో సిరి ప్రవర్తనపై హైపర్ ఆది అదిరిపోయే జబర్దస్త్ పంచ్ వేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అదే ప్రోగ్రాం లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు అన్నంపెట్టింది జబర్దస్త్ స్టేజ్ అంటూ రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు. తర్వాత హరితేజ మహానటి కేరెక్టర్ లో చేసిన పెరఫార్మెన్స్ కి అక్కడ ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టడమే కాదు విజిల్స్ వేస్తూ గోల చేసేసారు. దసరా స్పెషల్ గా ఈ నవరాత్రి ధమాకా ప్రోగ్రాం ఆదివారం ప్రసారం కాబోతుంది.

Jabardasth Punch on Bigg Boss:

Navaratri Dhamaka, Dasara Navaratri Event 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs