Advertisement
Google Ads BL

మృణాల్ ఠాకూర్ ని పొగిడేస్తున్న ఫైర్ బ్రాండ్


బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన కంగనా రనౌత్.. ఎప్పుడు ఎవరిని పొగుడుతుందో.. ఎప్పుడు ఎవరిని తిడుతుందో ఆమెకే తెలియదు. బాలీవుడ్ సెలబ్రిటీస్ ని పేరు పేరునా విమర్శిస్తూ చెడుగుడు ఆడుకునే కంగనా రనౌత్ ఒకరిని ప్రశంసించింది అంటే మాములు విషయం కాదు. కంగనాతో మనకెందుకులే అని చాలామంది సైలెంట్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మృణాల్ ఠాకూర్ ని తెగ పొగిడేస్తోంది. మృణాల్ సీత గా సీతారామం చిత్రంలో అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చింది అంటూ ఇన్స్టా స్టోరీస్ లో పెట్టింది.   

Advertisement
CJ Advs

సౌత్ లో సూపర్ హిట్ అయిన సీతారామం మూవీ ఈ మధ్యనే బాలీవుడ్ లో  కూడా విడుదలై విమర్శకుల ప్రశంశలు అందుకుంది. అక్కడ క్రిటిక్స్ కూడా సీతా రామం మూవీకి సూపర్ రేటింగ్స్ ఇచ్చారు. దానితో అక్కడ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా సీతారామం మూవీ చూసిన కంగనా రనౌత్.. సీతారామం లో అందరూ బాగా నటించారని, కానీ అందులో మృణాల్ నటన తనకు అద్భుతంగా అనిపించిందని.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ గా వచ్చే సన్నివేశాల్లో చాలా బాగా నటించిందని, ఆమెలా మరెవరూ నటించలేరని పొగిడెయ్యడమే కాదు.. మృణాల్ నిజంగానే ఓ రాణి.. జిందాబాద్‌ ఠాకూర్‌ అంటూ కంగనా మృణాల్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది.

Kangana compliments Mrunal Thakur:

Kangana Ranaut reviews Sita Ramam, praises Mrunal Thakur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs