Advertisement
Google Ads BL

శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్


మెగా డాటర్ శ్రీజ కొద్ది రోజులుగా పర్సనల్ విషయాలతో వార్తల్లో  నిలుస్తుంది. కారణం ఆమె సెకండ్ మ్యారేజ్ కూడా డివోర్స్ అవ్వడమే. మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తో విడాకులు తీసుకున్న శ్రీజ తర్వాత చిరు స్నేహితుల కొడుకు కళ్యాణ్ ని రెండో పెళ్లి చేసుకుంది. ఒక కూతురు కూడా పుట్టిన తర్వాత శ్రీజ-కళ్యాణ్ సంసారంలో వచ్చిన కలతలు కారణంగా వారు డివోర్స్ అప్లై చేసారని అన్నప్పటికీ.. అధికారికంగా ఈ మేటర్ బయటికి రాలేదు. తర్వాత శ్రీజ ఒంటరితనంతో ఫీలవుతున్న కారణంగా అన్న రామ్ చరణ్ ఆమెని కొద్దిరోజులు ముంబై కి తీసుకువెళ్లాడు. 

Advertisement
CJ Advs

మళ్ళీ రీసెంట్ గా చెల్లెళ్లని, ఫ్రెండ్స్ ని తీసుకుని చరణ్ ఊటీకి కూడా వెళ్ళొచ్చాడు. ఇదంతా అలాఉంటే శ్రీజ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నా కష్ట సమయంలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తుంటే ఓదార్చి బుజం తట్టారు. మాట్లాడుతుంటే విన్నారు. నేను ఏం చేసినా యాక్సప్ట్ చేసారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇంతమంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు సంతోషంగా ఉన్నాను అంటూ శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Sreeja Konidela pens emotional post:

Sreeja Konidela shares emotional post on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs