Advertisement
Google Ads BL

కాజల్‌కి కష్టంగా ఉందట.. కానీ!


బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా శరీరంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా తను పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ.. త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేస్తున్నా అనేలా కాజల్ అగర్వాల్ హింట్ ఇచ్చేసింది. అయితే, అందుకోసం చాలా కష్టపడాల్సి వస్తుందని, ఇంతకు ముందులా శరీరం సహకరించడం లేదంటూ ఆమె ఈ వీడియోతో పాటు తెలిపింది. ఆమె చేసిన ఈ పోస్ట్‌.. ఆడవారిపై మరింత రెస్పెక్ట్ పెంచేలా ఉందంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్న కాజల్.. ఆ తర్వాత వెంటనే గర్భవతి కూడా కావడం, సినిమాలకు స్వస్తి చెప్పడం వంటి విషయాలు అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే ఆమె ఓ పండండి బాబుకి జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో.. ఎలా ఆమె ప్రిపేర్ అవుతుందో తెలిపేలా ఈ వీడియోని కాజల్ షేర్ చేసింది.

Advertisement
CJ Advs

 

‘‘నేను బిడ్డకు జన్మనిచ్చి అప్పుడే 5 నెలల అయిపోయాయి. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నీల్ ఆలనాపాలనా చూసేందుకే సమయం సరిపోవడం లేదు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాను. చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాను. అందుకోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. అయితే, ఇంతకు ముందులా నా శరీరం నాకు సహకరించడం లేదు. బిడ్డకు జన్మనివ్వకముందు.. వర్కవుట్స్‌కి నా శరీరం బాగా సహకరించేది. కానీ కొన్నాళ్లుగా వాటికి దూరంగా ఉండటంతో బాడీ రిలాక్స్ అయిపోయింది. అప్పటి ఎనర్జీ లెవల్స్ అయితే ఇప్పుడు కష్టమే. గుర్రాన్ని ఎక్కడం, దానిపై స్వారీ చేయడం ఇప్పుడు నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంతకుముందులా బాడీ సహకరించట్లేదు. గర్భం, ప్రసవం వంటి వాటితో శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ మనలో నేర్చుకోవాలనే తపన, పట్టుదలకు ఏదీ అడ్డంకి కాదు.. మన నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇస్తూ.. ముందుకెళ్లిపోవడమే’’ అంటూ కాజల్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.

Kajal Aggarwal Latest Instagram post goes Viral:

Kajal Aggarwal Ready to Re Entry 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs