శ్రీదేవి కూతురు అనే టాగ్ నుండి బయటికి రావడానికి జాన్వీ కపూర్ చాలా ప్రయత్నాలే చేస్తుంది. అందులో భాగమే గ్లామర్ డోస్ పెంచడం. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ బికినీ షోస్ చేసే జాన్వీ కపూర్.. సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అయ్యింది లేదు. ముందు వెండితెర మీద హిట్ కొట్టి అప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయితే బావుండేది. ఇక్కడ సక్సెస్ అవ్వడం లేదు, సోషల్ మీడియా లో పాపులర్ అవుదామనుకుంటుందో ఏమో.. బయటికి వస్తే చాలు గ్లామర్ షో గ్లామర్ షో అంటుంది. ఎద అందాలను చూపిస్తూ ఘాటైన స్కిన్ షో చేస్తుంది.
జిమ్ వెర్ లో ఫిట్ నెస్ డ్రెస్సులతో యూత్ మతులు పోగొట్టే జాన్వీ కపూర్ ఇప్పుడు అందాలు ఆరబొయ్యడంలో మరింతగా ముదిరిపోయింది అనే చెప్పాలి. విటమిన్ సి కోసం జాన్వీ కపూర్ ఇలాంటి హాట్ షో కి తెరలేపింది. జాన్వీ కపూర్ గ్లామర్ పిక్ చూసిన యూత్ కి పిచ్చెక్కిపోతుంది. కానీ కొంతమంది మాత్రం ముందు సినిమాల్లో సక్సెస్ అవ్వు తర్వాత ఇలాంటి గ్లామర్ షో చేద్దువు గాని అంటూ సలహాలు పడేస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా త్వరలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి జాన్వీ కపూర్ నటించబోయే ఆ టాలీవుడ్ హీరో ఎవరో చూడాలి.