Advertisement
Google Ads BL

నేను శ్రీసత్య ని మోసం చెయ్యలేదు: పవన్


బుల్లితెర సీరియల్స్ లో విలన్ వేషాలు వేసే శ్రీ సత్య ఇప్పుడు స్టార్ మా బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరైంది. హౌస్ లో శుభ్రంగా తిని పడుకుని ముచ్చట్లు పెట్టడంలో శ్రీ సత్య నెంబర్ వన్. అందుకే నాగార్జున ఆమెని చెడా మాడా తిట్టడమే కాదు, కంటెస్టెంట్స్ తో వరెస్ట్ కంటెండర్ అని ఓట్లు కూడా వేయించి జైలు కి కూడా పంపించారు. తర్వాత నామినేషన్స్ విషయంలో, అలాగే తనని ఒకరు ప్రేమించానని చెప్పి మోసం చెయ్యడంతో సూయిసైడ్ ప్రయత్నం కూడా చేసుకున్నాను తర్వాత హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదంటూ బిగ్ బాస్ హౌస్ లో అందరిని కంటతడి పెట్టించింది. పవన్ రెడ్డితో రిలేషన్ తన ఫ్యామిలీ ఎవరికి ఇష్టం లేకపోయినా.. అతన్ని ప్రేమించానని కానీ చివరికి అతనే తనని మోసం చేశాడని చెప్పుకొచ్చింది. 

Advertisement
CJ Advs

అందుకే తాను ఎవరితో మాట్లాడనని, ఎవరిని నమ్మను అని చెప్పింది. అలాగే తన యాటిట్యూడ్ తోనూ శ్రీసత్య హౌస్ లో స్పెషల్ గా హైలెట్ అవుతుంది. అయితే ఇప్పుడు శ్రీసత్య ఆరోపణలు నిజం కాదు అంటూ శ్రీసత్య మాజీ ప్రియుడు పవన్ రెడ్డి లైన్ లోకి వచ్చాడు. శ్రీసత్యకి పవన్ రెడ్డికి ఎంగేజ్మెంట్ కూడా జరిగాక వారి ప్రేమని ఫామిలీస్ ఒప్పుకొని కారణంగా విడిపోయామని, కానీ నేను శ్రీ సత్యని అసలు మోసం చెయ్యలేదని, మోసం చేయాలనుకుంటే.. నిశ్చితార్ధం ఎందుకు చేసుకుంటానని, పెళ్లి వరకూ మ్యాటర్‌ని ఎందుకు తీసుకుని వస్తానని వాదిస్తున్నాడు పవన్ రెడ్డి. బిగ్ బాస్ లో ఆమెకి ఓట్స్ పడేందుకు, క్రేజ్ కోసం నన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తుంది అంటూ పవన్ రెడ్డి మొత్తుకుంటున్నాడు.

I didn't cheat Sri Satya: Ex Boyfriend Pavan Reddy:

Sri Satya engagement with Ex Boyfriend Pavan Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs