ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ ఎంత కేర్ ఫుల్ గా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడో.. ఇటు రామ్ చరణ్ కూడా అంతే కేర్ ఫుల్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శంకర్ తో RC15 చేస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చెయ్యాలి. అక్కడ స్టోరీ లైన్ బావున్నా సరే స్టోరీ డెవెలప్మెంట్ లో రామ్ చరణ్ ని శాటిస్ ఫై చెయ్యలేకపోవడం వలన కొంచెం టైం ఇచ్చాడు గౌత తిన్ననూరికి.
గౌతమ్ ఆ కథని ఇంకాస్త బ్రిలియెంట్ గా డెవెలెప్ చేసుకోవడానికి టైం ఇచ్చాడు. ఈలోపులో కన్నడ డైరెక్టర్ నర్తన్ ని రామ్ చరణ్ కోసం యువీ క్రియేషన్స్ వారు తీసుకొచ్చారు. నర్తన్ చెప్పిన స్టోరీ లైన్ కి రామ్ చరణ్ ఓకె చేసినట్లుగా తెలుస్తుంది. ఫైనల్ వెర్షన్ విన్నాక అది గనక నచ్చితే అదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అవ్వొచ్చు రామ్ చరణ్ ది. అదే కాకుండా ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో ఓ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఇవన్నీ చూసిన మెగా ఫాన్స్ రామ్ చరణ్ వి అన్నీ నెక్స్ట్ లెవల్ ప్లానింగ్ అంటూ హ్యాపీ గా ఫీలవుతున్నారు.