Advertisement
Google Ads BL

అభిమానులకి బాడ్ న్యూస్


ట్రిపుల్ ఆర్ హీరోలు ఆస్కార్ కి నామినేట్ అవ్వబోతున్నారనే న్యూస్ ఆయా హీరోల అభిమానులని సంబరపడేలా చేసింది. టాలీవుడ్ నుండి ఆస్కార్ బరిలో నిలిస్తే అది నిజంగా ఓ సెన్సేషన్ అయ్యేది. విమర్శకులు సైతం మెచ్చిన ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందేమో అన్న ఊహే ఫాన్స్ ని నిలబనివ్వలేదు. అవార్డు వస్తేనేమి.. రాకపోతేనేమి.. అసలు ఆస్కార్ కి నామినేట్ అవడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే ట్రిపుల్ ఆర్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వస్తే ఇద్దరికీ ఆస్కార్ రావాలంటూ అభిమానులు డిమాండ్ కూడా చేసారు.

Advertisement
CJ Advs

జస్ట్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు పరిశీలనలో ట్రిపుల్ ఆర్ మూవీ ఉంటేనే.. ఆస్కార్ కి నామినేట్ అయినట్లుగా ఉత్సాహపడిన ఫాన్స్ కి ఇప్పుడొక బాడ్ న్యూస్ వినిపించింది. అదేమిటంటే ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరి నుండి తప్పుకుంది అని. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి నుండి వెలువడిన అధికారిక న్యూస్ ప్రకారం ఇండియా నుండి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటరిగిలో గుజరాతి మూవీ చలో షో రాబోయే 2023 ఆస్కార్ బరిలో స్థానాన్ని దక్కించుకుంది. దీనితో ఒక్కసారిగా ట్రిపుల్ అభిమానులు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నిరాశపడిపోతున్నారు. నిరాశ అనేకన్నా ఒకరకంగా షాక్ తగిలినట్లైంది అభిమానులకి.

Chhello Show pips RRR for Oscars:

Heartbreak for RRR: Chhello Show Indian entry for Oscars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs