త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో హీరోయిన్స్ ని చాలా స్పెషల్ గా చూపిస్తుంటారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కి ఏదో ఒక ఫోబియో పెట్టి ప్రేక్షకులకి కొత్తగా చూపిస్తారు. ఆయన సినిమాల్లో జల్సాలో, జులాయి లో ఇలియానాని అమాయకంగా, అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి లో సమంత ని షుగర్ పేషేంట్ గా ఇలా అన్నమాట. కానీ అలా వైకుంఠపురములో పూజ హెగ్డే ని చాలా స్పెషల్ గా గ్లామర్ గా చూపించారు. ఆ సినిమాలో పూజ హెగ్డే అందాలకు అల్లు అర్జున్ మాత్రమే కాదు.. యూత్ కూడా ఫిదా అయ్యింది.
ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్, మహేష్ SSMB28 లో సినిమాలో పూజ హెగ్డే ని రిపీట్ చేస్తున్నారు. అంతేకాకుండా పూజ హెగ్డే కోసం త్రివిక్రమ్ ఓ ప్రత్యేక పాత్రని చాలా కొత్తగా, గ్లామర్ గా డిజైన్ చేశారట. SSMB28 లో హీరోయిన్ - హీరో కలయికలో వచ్చే సన్నివేశాల ట్రాక్ బావుంటుంది అని, చాలా కొత్తగా ఉండబోతుంది అని, హీరోయిన్ పాత్ర ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని తెలుస్తుంది.