Advertisement
Google Ads BL

NC 22 షూటింగ్ అప్ డేట్


అక్కినేని నాగ చైతన్య-వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి NC22 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 నాగచైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభుకి కూడా ఇది తొలి తెలుగు సినిమా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైయింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి.  

Advertisement
CJ Advs

నాగ చైతన్య అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో NC22 చిత్రీకరణ ప్రారంభం కానుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాం. రేపటి నుండి #NC22 యాక్షన్ బిగిన్స్ అని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబధించిన ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్ ప్రైజ్ చేయడంతో పాటు ఆసక్తిని పెంచింది.

నాగ చైతన్య అప్పిరియన్స్, లుక్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్‌ లు వుండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో పవర్ ఫుల్ వైబ్స్ ని కలిగివుంది.  

NC 22 Shoot Starts Tomorrow:

Naga Chaitanya-Venkat Prabhu NC 22 Shoot Starts Tomorrow <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs