రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ట్రిపుల్ ఆర్ ఆస్కార్ కి నామినేట్ అవడం, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిలవడంతో ఇద్దరి హీరోల ఫాన్స్ చాలా సంతోషపడిపోతున్నారు. అటు నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్, ట్రిపుల్ ఆర్ ని గొప్పగా పొగుడుతున్నాయి. మరి ఇంతటి అద్భుత క్షణాలను రాజమౌళి ఆస్వాదించడం పక్కనబెడితే.. ఆస్కార్ వస్తే హ్యాపీ నే. కానీ ఆ ఎఫెక్ట్ తాను తియ్యబోయే నెక్స్ట్ సినిమాపై అస్సలుండదు అంటూ కుండబద్దలు కొట్టేసారు. నా నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో మార్పు ఉండదు అని చెప్పారు. ఆస్కార్ వచ్చినా.. రాకపోయినా.. నా నెక్స్ట్ సినిమా ప్రణాళికలో ఎలాంటి మార్పు ఉండదు. ఆస్కార్ వస్తే అటు దేశానికీ గర్వకారణం. ఇటు సినిమాలకు ఉత్సాహాన్నిస్తుంది.
ఆస్కార్ వలన నేను చెయ్యబోయే సినిమాలో, నా పనిలో ఎలాంటి మార్పు ఉండదు. నేను చేసే పనిని మరింత మెరుగు పరుచుకోవాలి, కథ చెప్పే విధానంలో మరింత బలాన్ని పెంచుకోవాలి. ఒక కథలో బ్రిటిషర్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే.. ప్రతి బ్రిటిష్ వాడు విలన్ కాదు, నా హీరోలు ఇండియన్స్ అంతే. ఇండియన్స్ అంతా నా సినిమాలని అర్ధం చేసుకుంటే చాలు. కథ చెప్పే విషయం అందరికి అర్ధమైతే చాలు.. హీరో ఎవరు-విలన్ ఎవరు అనేది తెలిస్తే.. భావోద్వేగాలు అర్ధమవుతాయి అంటూ రాజమౌళి ఆస్కార్ విషయంలో సంచనలన వ్యాఖ్యలు చేసారు.