ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవాలంటే రాజమౌళి బాహుబలి తర్వాత అమీర్ ఖాన్ దంగల్ అనే చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దంగల్ రెండో స్థానంలో నిలుస్తుంది. అటువంటి చిత్రం దంగల్ లో అమీర్ ఖాన్ కూతురిగా అప్పట్లోనే మెప్పించిన ఫాతిమా సనా షేక్ తర్వాత అమీర్ ఖాన్ చిత్రంలోనే హీరోయిన్ గా నటించినా ఆమెకి ఆ చిత్ర రిజల్ట్ కావాల్సిన బ్రేక్ ఇవ్వలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ లోను నటించి డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో ఫాతిక సనా షేక్ ఓ వెబ్ సీరీస్ లో నటించబోతుంది. ఫాతిమాని ప్రధాన పాత్రలో పెట్టి తెలుగు నిర్మాతలు ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేసారు. ఆ వెబ్ సీరీస్ వివరాలు త్వరలోనే.. అలా దంగల్ బ్యూటీ తెలుగులోనూ రంగంలోకి దిగబోతుంది.