గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న NBK 107 షూటింగ్ ప్రస్తుతం టర్కీ లో జరుగుతుంది. హీరోయిన్ శృతి హాసన్, చిత్రంలోని కీలక నటులు పాల్గొంటున్న ఈ భారీ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటుగా పవర్ ఫుల్ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు NBK107 బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అఖండ విజయం NBK107 బిజినెస్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్, టీజర్ అన్నిటిలో బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ అన్ని అదిరిపోవడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆ ఇంట్రెస్ట్ తోనే ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఏరియా ల వైజ్ గా NBK107 చిత్ర బిజినెస్ వివరాలు..
ఏరియా బిజినెస్
నైజం 23 కోట్లు
సీడెడ్ 20 కోట్లు
ఆంధ్ర 45 కోట్లు
కర్ణాటక 6 కోట్లు
ఓవర్సీస్ 12 కోట్లు
ఇతర ప్రాంతాలు 6 కోట్లు
ఇలా 107 కోట్ల ఫిగర్ తో NBK107 బిజినెస్ జరగబోతుంది అని తెలుస్తుంది. ఇక 62 కోట్లకి NBK107 నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడైపోయినట్లుగా సమాచారం. ఇంత పెద్ద బిజినెస్ జరగడం బాలయ్య కెరీర్ లో ఇదే మొదటిసారి.