బిగ్ బాస్ కల్చర్ పై సీపీఐ నారాయణ చేస్తున్న వ్యాఖ్యలకు ధీటుగా నాగార్జున ఇండైరెక్ట్ గా సమాధానం చెబుతున్నారు. కానీ అలాంటిదేం లేదంటూ నాగర్జున చెబుతున్నా నారాయణని ఉద్దేశించే నాగ్ కామెంట్స్ చేస్తున్నారని అందరికి అర్ధమవుతుంది. నారాయణ మాత్రం బిగ్ బాస్ ని దానిని హోస్ట్ చేస్తున్న నాగార్జునని వదలకుండా వెంటపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ కాదు, బ్రోతల్ హౌస్ అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నారాయణకు తోడు మరో నటుడు కూడా నాగార్జునపై చిందులు తొక్కుతున్నారు. ఈ మధ్యన నాగార్జున హౌసు లోకి జంటగా పంపిన మరీనా-రోహిత్ జంటతో పబ్లిక్ గా రొమాన్స్ చేయిస్తున్నారు. అంటే ముద్దులు, హగ్గులు అంటూ పబ్లిక్ గా చేయిస్తూ మీకు లైసెన్స్ ఉంది అని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.
అయితే నటుడు చిట్టిబాబు నాగార్జున తన భార్య అమల తో అలా పబ్లిక్ గా రొమాన్స్ చేస్తారా.. బిగ్ బాస్‌ని బ్రోతల్ హౌస్ అంటూ నారాయణ వాడిన పదం తప్పగా ఉండొచ్చేమో కానీ.. దాని అర్ధం ఒక్కటే. ఎందుకంటే బూతు అంటే.. విప్పి చూపించడమే కాదు.. పబ్లిక్ రొమాన్స్ కూడా బూతే. నాలుగు గోడల మధ్యన జరిగే భాగోతాన్ని పబ్లిక్ గా చూపిస్తారా? బిగ్ బాస్ అంటే రియాలిటీ షో అయితే.. రియల్ పర్సనాలిటీని బయటకు తీయడం బిగ్ బాస్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ జరిగేదేమిటి, పబ్లిక్ గా ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు.. ఇలాంటి షోస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు.. అలా చెయ్యడం కరెక్ట్ కాదు అంటూ నాగార్జునపై చిట్టిబాబు చిందులు తొక్కుతున్నారు.