Advertisement
Google Ads BL

వాయిదా పడిన పవన్ బస్సు యాత్ర


పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో.. ఎప్పుడు సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతారో.. ఎప్పుడు రాజకీయాలతో బిజీ అవుతారో అనే విషయంలో ఆయన ఫాన్స్ గందరగోళంలో ఉంటున్నారు. సినిమాల షూటింగ్స్ కి హాజరు కావడం లేదు, ఇటు పొలిటికల్ గాను పవన్ తీసుకునే నిర్ణయాలేమిటో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 న బస్సు యాత్ర కోసం రెడీ అవ్వాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కోసం ఎన్టీఆర్ చైతన్య రథం లాంటి బస్సు ని రెడీ కూడా చేస్తున్నారు. అయితే అక్టోబర్ 5 నా మొదలు కావల్సిన బస్సు యాత్రని పవన్ కళ్యాణ్ వాయిదా వేశారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం అక్టోబరు నుంచి నియోజకవర్గాల వారీగా మంగళగిరి కార్యాలయంలో సమీక్ష సమావేశాలు జరుగుతాయని, ముందుగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంతో సమీక్ష సమావేశాలు మొదలుపెడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే అక్టోబర్ 5 నుండి జరగాల్సిన బస్సు యాత్రని వాయిదా వేస్తున్నట్టుగా పవన్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ కోసం ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ ఎదురు చూస్తున్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేస్తే ఆయన పనైపోయింది.. అందుకే క్రిష్ ఎదురు చూపులు. కానీ పవన్ ఆ సమయం ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Pawan Kalyan Postpones Bus Yatra:

Pawan Kalyan Bus Yatra Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs