Advertisement
Google Ads BL

తమిళ యంగ్ హీరోయిన్ సూయిసైడ్


కొంతమంది నటులు కెరీర్ బాలేదనో, ప్రేమ విఫలమైందనో, డిప్రెషన్ తోనో ఆత్మహత్యలకి పాల్పడుతుంటారు. అలానే ఇప్పుడొక కోలీవుడ్ యువ నటి దీప ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న దీప 29 ఏళ్లకే తనువు చాలించడం అందరిని కలిచివేసింది. అయితే దీప ఆత్మహత్యకి కారణం ప్రేమ వ్యవహారమే అనే అనుమానం పోలీస్ లు వ్యక్తం చేస్తున్నారు. కారణం దీప ఒకరితో లవ్ లో ఉండడమే.

Advertisement
CJ Advs

దీప తల్లితండ్రులు దీప ప్రేమని అంగీకరించకుండా వెరికోరితో పెళ్లి చెయ్యడానికి ప్రయత్నం చెయ్యగా ఆమె బయటికి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటుంది అని, అలా ఒంటరి జీవితంలో మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఇంట్లోనే బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు ఆమెకి ఫోన్ చెయ్యగా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఫ్రెండ్స్ ఆమె ఫ్లాట్ కి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడంతో వెంటనే పోలీస్ లకి సమాచారం అందించగా వారు వచ్చి కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీప చనిపోయిన చోట సూయిసైడ్ నోట్ లభ్యమవగా ఆ నోట్ లో తన చావుకి ఎవరూ కారణం కాదని, కానీ జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటానంటూ ఆమె రాసిన లెటర్ తో ఆమె ఆత్మహత్యకి ప్రేమ వ్యవహారమే అని పోలీస్ లు ప్రాధమిక విచారణలో తేల్చేసారు.

Young Tamil actress Deepa dies by suicide:

Tamil actor Deepa dies by suicide at 29
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs