Advertisement
Google Ads BL

ఆ లేడీ కండక్టర్‌కు సినిమా ఛాన్స్


ఈటీవీలో ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో రీసెంట్‌‌గా గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ పాల్గొని.. డ్యాన్స్ చించేసిన విషయం తెలిసిందే. ఆమె డ్యాన్స్‌కి అంతా ఫిదా అవడమే కాకుండా.. ఆమె టాలెంట్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. నిజంగా ఒక లేడీ కండక్టర్ అయి ఉండి.. అలా డ్యాన్స్ చేయడం చాలా గొప్పవిషయం. కానీ తన టాలెంట్ మరుగున పడిపోకూడదని.. ధైర్యంగా ఓ స్టేజ్‌పై డ్యాన్స్ చేసి తనేంటో చూపించింది.. తద్వారా ప్రేక్షక ప్రపంచానికి దగ్గరైంది. ఇప్పుడామె కండక్టరే కాదు.. పెద్ద సెలబ్రిటీ కూడా. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తర్వాత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్.. ఆమెతో ఇంటర్వ్యూకి క్యూ కట్టాయి. ఆ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పే విషయాలు వింటే అంతా ఆశ్చర్యపోవాల్సిందే. 

Advertisement
CJ Advs

 

ఇక ఆమె టాలెంట్‌ని గుర్తించిన ఓ టాలీవుడ్ హీరో.. ఫోన్ చేసి మరీ తన సినిమాలో అవకాశం కల్పించాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కండక్టర్ వెల్లడించింది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈ విషయం స్వయంగా తనే చెప్పింది. సంపూర్ణేష్ బాబు చేస్తున్న చిత్రంలో తనకు ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందని, స్వయంగా సంపూర్ణేష్ బాబే తనకు ఫోన్ చేసి, ఈ అవకాశం ఇవ్వడంతో చాలా సంతోషించానని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ పాటకి సంబంధించిన షూటింగ్‌లో కూడా తను పాల్గొంటున్నట్లుగా ఝాన్సీ వెల్లడించింది. సో.. దీనిని బట్టి చెప్పొచ్చేదేమిటంటే.. టాలెంట్ ఉంటే సరిపోదు.. దానిని ఎక్స్‌పోజ్ చేసే తెగింపు కూడా ఉండాలి.

Cinema Chance to Gajuwaka Lady Conductor Jhansi:

Gajuwaka Lady Conductor Jhansi gets Cinema Chance in Sampoo film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs