మహేష్ బాబు-త్రివిక్రమ్ ఈ కాంబో వచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతుంది. వీరి కలయికలో అతడు, ఖలేజా తెరకెక్కగా అతడు బ్లాక్ బస్టర్ హిట్ అవడం.. ఖలేజా సోసో హిట్ అయినప్పటికీ.. ఖలేజా, అతడు ఇప్పటికీ టీవీ ఛానల్స్ లో మోగుతూనే ఉంటాయి. మళ్ళీ ఆ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో మహేష్ ఫాన్స్ లోనే కాదు, త్రివిక్రమ్ ఫాన్స్ లోను అలాగే సాధారణ ప్రేక్షకుడిలోనూ ఎంతో ఉత్సుకత ఉంది. రీసెంట్ గానే మహేష్-త్రివిక్రమ్ లు SSMB28 సెట్స్ మీదకి వెళ్లడం, ఫస్ట్ డే షూటింగ్ గ్లిమ్ప్స్ వదలడం చక చకా జరిగిపోయాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన గ్లామర్ బ్యూటీ పూజ హెగ్డే నటిస్తుంది.
అయితే ఫస్ట్ షెడ్యూల్ నే రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టిన త్రివిక్రమ్.. మహేష్ తో మొదటగా ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబు స్టైలిష్ గా విలన్స్ ని చితగ్గొట్టే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్-పూజ హెగ్డే కాంబో అన్నారు కానీ.. అందులోని విలన్ అలాగే కీలక నటుల వివరాలు మాత్రం బయటపెట్టలేదు. మరి మహేష్ తో ఆ తన్నులు తినే విలన్ ఎవరో ఇంకా సస్పెన్స్ గానే ఉంది.