Advertisement
Google Ads BL

బిగ్ బాస్ హౌస్ లో సుధీర్ బాబు-కృతి శెట్టి


బిగ్ బాస్ తెలుగులో మొదలు పెట్టిన తర్వాత తమ సినిమాల ప్రమోషన్స్ కోసం హీరో-హీరోయిన్స్ - డైరెక్టర్స్ కలిసి బిగ్ బాస్ లోకి వెళ్లి మరీ సినిమా ప్రమోట్ చేసుకుంటున్నారు. గత రెండు సీజన్స్ లో కోవిడ్ వలన ఎవరూ హౌస్ లోకి అడుగుపెట్టకపోయినా.. శని, ఆదివారాల్లో నాగార్జున ఎపిసోడ్స్ కి వచ్చి తమ సినిమాల ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ కపుల్ అలియా భట్-రణబీర్ కపూర్ లే బ్రహ్మస్త్ర ప్రమోషన్స్ కోసం వచ్చారంటే తెలుగు వాళ్ళు ఎందుకాగుతారు. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 లోకి మొదటిగా ఎంట్రీ ఇచ్చిన హీరో-హీరోయిన్ ఎవరంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టి లు. 

Advertisement
CJ Advs

వీరిద్దరూ ఈ రోజు ఎపిసోడ్ కి వచ్చిన ప్రోమో ని విడుదల చేసారు. సుధీర్ బాబు-కృతి శెట్టి జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి స్టైలిష్ గా అడుగుపెట్టగా హౌస్ మేట్స్ చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. తర్వాత  హౌస్ మేట్స్ కూడా ఫన్నీ స్కిట్స్ తో సుధీర్ బాబుని, కృతి శెట్టి ని ఇంప్రెస్స్ చేసారు. ఎక్కువగా మహేష్ బాబు ని ఇమిటేట్ చేసారు హౌస్ మేట్స్. అందరిలో రాజ్-సూర్య-శ్రీ సత్య చేసిన ఫన్నీ స్కిట్ ఆకట్టుకున్నట్టుగా ప్రోమోలో హైలెట్ చేసారు. అన్నట్టు ఆ అమ్మాయి గురించి చెప్పాలి ఈ రోజే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందండోయ్.

Sudheer Babu - Kriti Shettyin the Bigg Boss house:

Bugg Boss 6: Today promo highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs