Advertisement
Google Ads BL

కృతి శెట్టి మనసులోని స్టార్ హీరోలు


ఈమధ్యన నెలకొక సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్న కృతి శెట్టి కి ద వారియర్, మాచర్ల నియోజక వర్గం బ్యాక్ టు బ్యాక్ డిసాస్టర్ ఇచ్చాయి. ఆ సినిమాలు ప్లాప్ అవడంతో కాస్త డిస్పాయింట్ అయిన కృతి శెట్టి నెల తిరక్కుండానే సుధీర్ బాబు తో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రెండు డిజాస్టర్స్ తర్వాత ఈ సినిమాతో అయినా తనకు సక్సెస్ రావాలని కృతి గట్టిగానే కోరుకుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రమోషన్స్ లో ఉత్సాహం గా పాల్గొన్న కృతి శెట్టి.. తన మనసులో ఉన్న స్టార్ హీరోల పేర్లు బయటపెట్టడమే కాకుండా.. వారు ఎందుకు స్టార్స్ అయ్యారో చెబుతూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. 

Advertisement
CJ Advs

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అన్నా, తమిళనాట తలపతి విజయ్ అన్నా చాలా ఇష్టమని చెప్పడమే కాదు, వారిపై బేబమ్మ కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అని చెప్పింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను ఒక ఇన్ స్పైరింగ్ సూపర్ సూపర్ స్టార్ అంటూ చెప్పింది. దీనితో ఈ ఇద్దరు స్టార్స్ తో నటించేందుకు కృతి శెట్టి మంచి స్కెచ్చే వేసింది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుండగా.. కృతి శెట్టి మహేష్-విజయ్ పై ఒకేలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Krithi Shetty thinks this about star heroes:

Krithi Shetty comments on Mahesh and Vijay
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs