Advertisement
Google Ads BL

నేటి సినిమాల మ్యాటర్ ఏంటంటే..


ఈరోజు సెప్టెంబర్ 16 టాలీవుడ్ లో జాతరని తలపించేలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతున్నాయి. లైగర్ లాంటి భారీ బడ్జెట్ మూవీ తర్వాత వరసగా చిన్న సినిమాల హవా నడుస్తుంది. గత వారం విడుదలైన శర్వానంద్ ఒకే ఒక జీవితం సూపర్ హిట్ అవ్వగా.. ఈ వారం చాలా సినిమాలు పొలోమంటూ థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. అందులో మూడు సినిమాలు నోటెడ్ కాగా.. మిగతావన్నీ డబ్బింగ్ ఇంకా చిన్న చిన్న సినిమాలే. ముందుగా చెప్పుకోదగ్గ సినిమాలేవంటే.. సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో సుధీర్ బాబు తో కృతి శెట్టి రొమాన్స్ చేస్తుంది.

Advertisement
CJ Advs

తర్వాత హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావల్సిన వాడిని. కోడి రామకృష్ణ కూతురు కోడి దీప్తి నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. ఇక మూడోది రెజీనా-నివేత థామస్ కలిసి కనిపించిన శాకినీ ఢాకిని. ఇదో కొరియన్ మూవీకి రీమేక్. ఇక తర్వాత కన్నడ డబ్బింగ్ సినిమా K3. మొన్నామధ్యన విక్రాంత్ రోనాతో హిట్ అందుకున్న కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఆ సక్సెస్ పేరు చెప్పుకుని K3 పేరుతొ మళ్ళీ వస్తున్నాడు. ఈ నాలుగే కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు వాటికి దొరికిన థియేటర్లలో దిగనున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు విడుదల అవుతోన్న ఈ సినిమాల రిజల్ట్స్ ఏమిటో.. వీటి రివ్యూస్ ఏమిటో.. వీటి రిపోర్ట్స్ ఏమిటో.. మరి కాసేపట్లో.. stay tune to cinejosh.

September 16th Tollywood releases :

Sep16 releases: Aa Ammayi Gurunchi Meeku Cheppali,Nenu Meku Baga Kavalasinavadini,Saakini Daakini
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs