ఏప్రిల్ 14 న కోరుకున్న ప్రియుడు రణబీర్ కపూర్ తో పెళ్లి పీటలెక్కి ఏడడుగులు నడిచిన బాలీవుడ్ క్యూటీ అలియా భట్ రెండు నెలలు తిరక్కుండానే భర్త రణబీర్ కపూర్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తాము తల్లితండ్రులం కాబోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఈ జంట. అలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా షూటింగ్స్ లో పాల్గొంది, డార్లింగ్, బ్రహ్మస్త్ర ప్రమోషన్స్ లోను హుషారుగా కనిపించింది. హెల్దీగా ఉంటే ఎలాంటి ప్రోబ్లెంస్ రావు అంటూ అలియా భట్ ఉత్సాహంగా పని చేసుకుంటుంది. బ్రహ్మస్త్ర కి ఎలాంటి టాక్ వచ్చినా సూపర్ హిట్ కలెక్షన్స్ రావడంతో ఈ జంట చాలా హ్యాపీ మోడ్ లో ఉంది.
అయితే ఇప్పుడు అలియా భట్ సీమంతానికి వేళయింది అంటున్నారు. అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ మరియు అత్తగారు నీతూ కపూర్ అలియా కోసం బేబీ షవర్ ఫంక్షన్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇప్పటికే అలియా భట్ కి సంబందించిన సీమంతం వేడుకలు ముంబై వేదికగా మొదలు పెట్టారని, ఈ ఈవెంట్ కి బాలీవుడ్ ప్రముఖులు చాలామంది హాజరయ్యే అవకాశం ఉంది అని, అలియా భట్ చిన్ననాటి స్నేహితులు కూడా ఈ వేడుకకి హాజరు కావొచ్చని అంటున్నారు. అలియా ఫ్యామిలీ-కపూర్ ఫ్యామిలీ అలియా భట్ సీమంతానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయబోతున్నారని సమాచారం.