ద వారియర్ డిసాస్టర్ తో రామ్ కాస్త డిస్పాయింట్ అయినా.. ప్రస్తుతం ఆయన బోయపాటి తో చెయ్యబోయే పాన్ ఇండియా మూవీ RAPO20 కోసం ప్రిపేర్ అవుతున్నారు. రీసెంట్ గానే రామ్ పోతినేని లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఆ లుక్ ఆ మేకోవర్ అంతా బోయపాటి సినిమా కోసమే అంటున్నారు. ఆ లుక్ లో రామ్ గెడ్డం పెంచి, హెయిర్ పెంచి సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. తాజాగా థమన్ కూడా బోయపాటి-రామ్ కాంబో మూవీ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్ డేట్ కూడా ఇచ్చాడు. అయితే రామ్ ఈ మూవీ తర్వాత తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ టాప్ డైరెక్టర్ తో చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.
ద వారియర్ ని కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి తో తెలుగు, తమిళ భాషల్లో చేసిన రామ్.. బోయపాటి తో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ఇంతకుముందు నుండే రామ్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గౌత మీనన్ తో బైలింగువల్ మూవీ చెయ్యబోతున్నట్టుగా టాక్ ఉంది. అది టాక్ కాదు.. రామ్ తో మూవీ చెయ్యబోతున్నట్టుగా గౌత మీనన్ ఓ ఇంటర్వ్యూలో కన్ ఫర్మ్ చేసి చెప్పడంతో రామ్ పోతినేని RAPO21 ఫిక్స్ అయినట్లుగా క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తారని తెలుస్తుంది.