Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: అప్పుడే టాప్ 5 అంటే కష్టమేమో


బిగ్ బాస్ సీజన్ 6 మొదలై ఇంకా రెండు వారాలు పూర్తి కాలేదు.. అప్పుడే టాప్ 5 గురించిన మాటలు మాట్లాడేస్తున్నారు కొందరు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ అరియనా గ్లోరీ ల ఇంటర్వ్యూలో అఖిల్ సార్థక్.. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఏం ఆడుతున్నారో అర్ధం కావడం లేదు, నామినేషన్స్ విషయంలోనూ చాలా సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేస్తున్నారు. కొంతమంది ఎక్కువగా కనిపిస్తే.. వాసంతి లాంటి వాళ్ళు అస్సలు కనిపించడం లేదు. వాళ్ళ ఫుటేజ్ కూడా ఇవ్వడం లేదు అంటూ అఖిల్ అరియనా తో చెప్పాడు. 

Advertisement
CJ Advs

అయితే టాప్ 5 లో ఎవరుంటారు అని అడిగిన ప్రశ్నకు అఖిల్ కొద్దిగా అలోచించి..రేవంత్, శ్రీహన్, సుదీప, ఫైమా, రోహిత్-మరీనా లు ఉంటారని, కానీ రెండో వారానికే టాప్ 5 అనేది అంచనా వెయ్యడం కష్టమని చెప్పాడు. 

ఇక రోహిత్-మరీనా లు జంట బాగా ఆడితే గెలుపుకు కూడా దగ్గరవ్వొచ్చని, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అని, కాకపోతే వాళ్ళు దాన్ని ఎలా వాడుతారో దానిపై వాళ్ళ గెలుపు ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. కాకపోతే రెండు వారాలకే కంటెస్టెంట్స్ బలాన్ని అంచనా వెయ్యడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా అఖిల్ అభిప్రాయమే. అఖిల్ చెప్పడం అని కాదు కానీ.. రెండో వారానికే టాప్ 5 లో ఎవరుంటారు అనేది ఎవ్వరూ తేల్చలేరు.. ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్స్ చాలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.

Akhil Sarthak revealed top 5 finalists of Bigg Boss6:

Bigg Boss Telugu 6 runner up Akhil Sarthak comes as guest in this show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs